Tuesday 6 March 2018


బూడిద


గొంతులోంచి వరుసగా తన్నుకొస్తున్న

కోరికలను నొక్కిపట్టి

దారంతా పూల వర్షం కురుపించుకొంటూ

దర్జాగా బయలుదేరాడు



నీతులు చెప్పుకుంటూ, లౌక్యంగా దోచుకొని

దాచుకోవాలన్న ఆరాటం ఆకాశం వైపు చూస్తుంటే

గులాల్ గుబాళింపు, డప్పుల మోతలతో

స్మశానం సందుల్లోకి సాగిపోయాడు



ఇంకా కావాలన్న కాంక్షను అదిమిపట్టి

మెల్లగా కాటిమీద కాలుజాపి పడుకున్నాడు

ఆశ, అంతస్తు, జీతం, జీవితం

అన్నీ ఏకమై మంటల్లా ఎగిసిపడుతుంటే

ఏదో సాదించాననుకొని మిడిసిపడుకుంటూ

గాలికెగిరే బూడిదయ్యాడు

Tuesday 19 September 2017

లక్ష్యం - 2

వచ్చిపోయే బందువులు
మర్చిపోయే సన్నిహితులు
బ్రతుకంతా నల్లగయ్యి
వయసంతా తెల్లగయ్యి
మనసంతా చేదుగయ్యి
నెల నెలా వచ్చే సాలరీ కోసం
జీవితాన్ని పెనం పై పెట్టి
సంతోషాన్ని ఆవిరి చేసుకుంటావెందుకు
ఎటు తిరిగినా
ఎడతెగని హిమని వలె
ఏదోరోజు చేరుకో
నీ లక్ష్యపు సంద్రాన్ని

Tuesday 1 August 2017

లక్ష్యం


మనకేం బ్రదరూ...
భయం, బాధా
గుండె అడుగున అదిమిపట్టి
నోటి నిండా నవ్వుతో
కనిపించే లౌక్యం నుండి
కనిపించని లక్ష్యం వరకు

స్వేచ్చగా ఎగిరిపోదాం

Tuesday 25 July 2017

ఒంటరిగా నేనివాళ


పదిమందికీ పరిచయమౌదామని
పక్కోడికి కూడా తెలియనంతగా
ఒంటరిగా నేనివాళ

ఉన్న నలుగురినీ ego తో వెలేసి
ఇంకో నలుగురికి దగ్గరవ్వడానికి, నన్ను నేనే వదిలేసుకొని
ఒంటరిగా నేనివాళ

అదేదో అయిపోదామని
ఏమీ అవక
ఇంకేమీ అవలేక
Online టచ్ లో ఉండటానికి, వెర్రి పోస్టులు పెడుతూ వెకిలిగా
ఒంటరిగా నేనివాళ

నాతో నేనున్నా, నేనేంటో తెలుసుకోలేక
అందిరితో ఉందామంటే, ఎవరేంటో తెలియలేక
నాకై నేనుగా bullshit లోకి జారిపడుతూ
ఒంటరిగా నేనివాళ



Monday 14 November 2016

Thinking fast and slow - Daniel Kahneman

"Daniel Kahneman's" book "Thinking fast and slow" is kind of very interesting plot about human behavior.

System 1 ---> Lion eats if we go nearby (experience)

System 2 ---> If one of your acquaintances dies when bird flew over the head, then your illogical belief system starts...

Idea #1

understanding system 1 and 2 is idea #1, and if you start living by understanding sys 1 and 2.

Eg:  You know that one of the most people's belief system does not work, but because of most people think so, you stick to it...at least externally...

Idea #2
Understanding the anchoring...

If you've given the hint... in that sense of scope, you will be thinking...

Eg:  If you have given a question about the price of the oven and if you don't know and hint is given like it is between 500 and 1000, automatically your thinking process revolves/adjusts between the mean price mostly...

Idea #3

The science of availability...

Eg:  If plane crashes and one of your friend died in it, automatically you will become either aware or beware about your plane journey...by either cancelling all your plane trips or travelling by plane with lot of fear.

Idea #4

Loss aversion

Eg:  Most of us having a fear of loss.  this is called as loss aversion.  in this, if you are asked to play a game to flip a coin and if you get heads then you will be rewarding with Rs. 1000 and if you get tails, then you have to pay Rs. 1000.

most of us won't play this game thinking that the probability of gaining...

if you think deeply, the chances will be 50-50%...even the reward is higher...

Idea #5

understanding framing...

Eg:  If doctor says 10% chances of death, then you will be happy...and if says only 90% of chances of survival... then you will be sad...

this is what in which way mostly you understand the situations...

Idea #6

sunk costs...

Eg:  If you bought a bag of candies, and you know it is not good for health, even then we tend to eat mostly daily ...because we bought them...

if you have guts to throw them out by understanding it hurts your health, then it is a good decision...most of us don't.

Saturday 17 September 2016

ఎంతో శ్రమించి ఉంటావు

ఎంతో శ్రమించి ఉంటావు

ఈ సాధారణ దేహాన్ని
ఆశువుగా ఊపిరిలూదడానికి కూడా
ఎంతో శ్రమించి ఉంటావు

అటు ఇటు కాకుండా వెళ్తున్న నన్ను చూసి
నవ్వుకొని ఉంటావు

నీకు నేను బఫ్ఫూనై ఉండి ఉంటాను
బాద్యత లేక భారమై ఉండి ఉంటాను

కాలిపోతున్న కాలాన్నీ
కరిగిపోతున్న శరీరాన్నీ
వృధా ప్రయాసనూ చూసి
వెగటు పుట్టి మొహం తిప్పుకొని ఉంటావు

చిన్న ఆశతో, పెద్ద ప్రయత్నాన్ని చేరుకొనేలోపు
అశువులు బాస్తాననే భయమా...
పుట్టించిందే నీవు కదా, కోరికనూ, నన్నూ...

టెస్ట్ పెట్టాలి

టెస్ట్ పెట్టాలి 

నా బాష్పాలకు లిట్మస్ టెస్ట్ పెట్టాలి
అంతుపట్టని ఆనందమో
ఎవరికీ ఎరుకలేని ఏడుపో

నా లక్ష్యానికి లై డిటెక్షన్ చేయాలి 
నిజపు నిలువుటేత్తులో
నిస్వార్దపు నీడలో

నా ఆశకు అగ్ మార్క్ ముద్రేయాలి
లక్ష్యానికి ప్రతిబింబమో
అంతుచిక్కని అనంతమో